![]() |
![]() |

'కాటమ రాయుడు' తరువాత తెలుగు తెరకు దూరమైన శ్రుతి హాసన్.. త్వరలో రవితేజ సరసన 'క్రాక్'తో పలకరించనున్నారు. అలాగే.. తన లక్కీ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్'లోనూ సందడి చేయనున్నారు. 'పింక్' రీమేక్ గా తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్'లో.. పవన్ తో కలసి శ్రుతి కనిపించనున్నారు. కాగా ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనని శ్రుతి.. డిసెంబర్ లో సెట్స్ లో జాయిన్ అవుతారట. పది నుంచి పదిహేను రోజుల పాటు పవన్, శ్రుతి కాంబినేషన్ లో కొన్ని సీన్స్, ఒక పాటని చిత్రీకరించబోతున్నారని సమాచారం.
వాస్తవానికి ఒరిజినల్‌లో పేషెంట్‌గా కనిపించే ఈ క్యారెక్టర్‌ను తెలుగు వెర్షన్‌లో చాలావరకు మార్చారని తెలుస్తోంది. పవన్ క్యారెక్టర్‌ను కూడా అలాగే చేంజ్ చేశారు. పింక్‌లో అమితాబ్ ఫైట్లు చేయరు. అందులో ఆయన వృద్ధ లాయర్‌గా కనిపిస్తారు. కానీ తెలుగు వెర్షన్‌లో ఆ క్యారెక్టర్ చేస్తున్న పవన్ కల్యాణ్ యంగ్‌గా కనిపించడమే కాదు, ఫైట్లు కూడా చేస్తారు. అదే తరహాలో శ్రుతి పాత్రను కూడా మార్చి, పవన్-శ్రుతి మధ్య రొమాంటిక్ యాంగిల్‌ను కూడా సృష్టించారు.
'గబ్బర్ సింగ్', 'కాటమ రాయుడు' తరువాత పవన్, శ్రుతి కాంబినేషన్ లో వస్తున్న 'వకీల్ సాబ్'.. శ్రుతి కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న 'వకీల్ సాబ్'కి తమన్ సంగీతమందిస్తున్నారు.
![]() |
![]() |