![]() |
![]() |

దగ్గుబాటి వారి బాబాయ్ - అబ్బాయ్.. మల్టిస్టారర్ చేయనున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ తాజా ఖబర్. వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ సమయంలో 'బాహుబలి' బ్యాడీ దగ్గుబాటి రానా పలు కథలు విన్నారట. వాటిలో ఒకటి తను, బాబాయ్ (వెంకటేష్) కలసి నటించేందుకు సరిపడ మల్టిస్టారర్ సబ్జెక్ట్ అని.. త్వరలోనే దర్శకుడు, ఇతర వివరాలు తెలియజేస్తానని రానా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు.. తమ హోమ్ బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుందని ఆయన తెలిపారు.
కాగా వెంకటేష్, రానా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఎనిమిదేళ్ళ క్రితం రానా కథానాయకుడిగా నటించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాలో వెంకీ కాసేపు ఓ పాటలో తళుక్కున మెరిశారు. కట్ చేస్తే.. ఇన్నేళ్ళకు ఈ ఇద్దరు ఫుల్ లెన్త్ మూవీలో కలసి నటించబోవడం విశేషం. దగ్గుబాటి ఫ్యాన్స్‌కు ఇది సంబరాన్ని కలిగించే విషయం.
![]() |
![]() |