![]() |
![]() |

ప్రీవియస్ మూవీ 'సైరా.. నరసింహారెడ్డి'లో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారతో జోడీ కట్టిన మెగాస్టార్ చిరంజీవి.. తన నెక్స్ట్ వెంచర్ కోసం టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తమిళ చిత్రం 'వేదాళమ్'కి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో చిరు సరసన స్వీటీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే చిరు, అనుష్క కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా చిరు సినిమాలో స్వీటీ నటించడం ఇదే తొలిసారి కాదు. 2006లో విడుదలైన 'స్టాలిన్'లో ఓ ప్రత్యేక గీతంలో ఆమె సందడి చేశారు. ఇక 'సైరా'లోనూ ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా అతిథి పాత్రలో కనిపించారు. అయితే ఫుల్ లెన్త్ సినిమాలో చిరు, స్వీటీ జంగటా నటించడం ఇదే ఫస్ట్ టైమ్ కాబోతోంది. కాగా, జనవరి 18 నుంచి 'వేదాళమ్' రీమేక్ షురూ కానుందని.. 2021 దసరాకి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సిల్వర్ స్క్రీన్ పైకి రానుందని సమాచారం.
![]() |
![]() |