![]() |
![]() |

ఓ వైపు అపోలో హాస్పిటల్స్ నిర్వహణ బాధ్యతలు.. మరోవైపు మెగా పవర్‌స్టార్ భార్యగా కుటుంబ బాధ్యతలు.. ఉపాసనా కామినేనిది బిజీ షెడ్యూల్. ఇదివరలో కాస్త బరువుగా కనిపించే ఆమె ఇటీవల స్లిమ్‌గా తయారయ్యారు. తన ఫిట్‌నెస్ రహస్యమేమిటో ఆమె చెప్పుకొచ్చారు. "నా దృష్టిలో ఫిట్‌నెస్ అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం. మనస్సు, దేహం, ఆత్మ.. అన్నీ కూడా ఒకదానితో మరొకటి సింక్ కావాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తాం. నిజం చెప్పాలంటే ఫిట్‌నెస్ విషయంలో చరణే నాకు స్ఫూర్తి." అని ఆమె అన్నారు.
పగటిపూట షూటింగ్ ఉన్నా, రాత్రి పూట షూటింగ్ ఉన్నా, కంటిన్యూగా షూటింగ్ ఉన్నా చరణ్ జిమ్‌కు వెళ్లి వర్కవుట్ చేయకుండా ఉండరు. "తనలోని ఆ క్వాలిటీ నాకు స్ఫూర్తినిస్తుంది. నా పని కూర్చొని చేసేది కానీ చరణ్ శారీరకంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆయన ఫిట్‌నెస్ కోసం వర్కవుట్స్ చేస్తుంటే నేనెందుకు ఫిట్‌గా ఉండకూడదనిపించింది. నా షెడ్యూల్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అయితే నా సగం పని డెస్క్ వెనకే ఉంటుంది. శరీరం మీద కంట్రోల్ ఉన్నప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేయొచ్చు. శరీరం ఫిట్‌గా ఉంటే పని కూడా ఫిట్‌గా ఉంటుంది. అప్పుడు మైండ్ జాయ్‌ఫుల్ అవుతుంది. పనితీరు కూడా మెరుగవుతుంది." అని వివరించారు ఉపాసన.
![]() |
![]() |