![]() |
![]() |

కింగ్ నాగార్జున కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలచిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా.. తండ్రి పాత్ర అయిన బంగార్రాజు ఆ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలచింది. అందుకే.. అదే పేరు (బంగార్రాజు)తో సీక్వెల్ ప్లాన్ చేశారు నాగ్ అండ్ కళ్యాణ్.
అయితే ఈ పాటికే ప్రారంభం కావాల్సిన ఈ క్రేజీ వెంచర్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. డిసెంబర్ 26 నుంచి ఈ సీక్వెల్ కి సంబంధించిన చిత్రీకరణని ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందట. అన్నీ కుదిరితే 2021 వేసవికి సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక సమాచారం అందే అవకాశముంది.
కాగా ప్రస్తుతం నాగ్ 'వైల్డ్ డాగ్' చేస్తున్నారు. ఇందులో ఆయనకి జోడీగా దియా మీర్జా నటిస్తుండగా, సయామీ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
![]() |
![]() |