![]() |
![]() |

నందమూరి కళ్యాణ్ రామ్ వన్ మాన్ షో డెవిల్ ఈ నెల 29 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లోనే అత్యధిక థియేటర్ లలో విడుదల అవుతున్న ఈ మూవీ మీద నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.
డెవిల్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యింది. అలాగే బుక్ మై షో యాప్ లో కూడా డెవిల్ టికెట్స్ బుకింగ్ హంగామా కొనసాగుతుంది. బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్ గానే సాగుతున్నాయి. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ తో డెవిల్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామనే ఆసక్తి అందరిలోను నెలకొని ఉంది. బింబిసార తో తన నటనలో ఉన్న కొత్త కోణాన్ని ప్రేక్షకులకి పరిచయం చేసిన కళ్యాణ్ రామ్ డెవిల్ తో తన నట విశ్వరూపాన్ని చూపించడం ఖాయమనే అభిప్రాయం కూడా చాలా బలంగానే ఉంది. అలాగే డెవిల్ తో కళ్యాణ్ రామ్ మరో భారీ హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది.

కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ కధానాయికగా నటించిన ఈ డెవిల్ ని అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామ నిర్మించారు. అలాగే ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. బ్రిటిష్ కాలం నాటి కథా నేపథ్యంతో ఈ మూవీ తెరకెక్కింది.
![]() |
![]() |