![]() |
![]() |

తమ కంటెంట్ మీద నమ్మకంతో ఇటీవల కాలంలో పలు చిన్న సినిమాలు పెయిడ్ ప్రీమియర్లకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ ట్రెండ్ ఫాలో అయ్యి పలు సినిమాలు సక్సెస్ కూడా అయ్యాయి. ఇప్పుడు అదే బాటలో పయనించడానికి మరో సినిమా సిద్ధమైంది.
నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల తనయుడు రోషన్ కనకాల 'బబుల్ గమ్' అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. మహేశ్వరీ మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' చిత్రాలతో ఆకట్టుకున్న రవికాంత్ పేరేపు ఈ సినిమాకి దర్శకుడు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తమ చిత్రం మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే డిసెంబర్ 28న కొన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్లు వేయాలని మేకర్స్ నిర్ణయించారు.
కాగా ప్రస్తుతం థియేటర్లలో డిసెంబర్ 22న విడుదలైన సలార్ ప్రభంజనం కొనసాగుతోంది. అలాగే డిసెంబర్ 29న డెవిల్ అనే మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో కళ్యాణ్ రామ్ రానున్నాడు. ఈ సినిమాల మధ్య ధైర్యంగా వస్తున్న 'బబుల్ గమ్'.. ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్లకు కూడా సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |