![]() |
![]() |

మొన్న డిసెంబర్ 7 న నాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ రిలీజ్ అయ్యి మొదటి షో నుంచే ప్యూర్ పాజిటివ్ టాక్ ని అందుకొని మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. నాని కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిన హాయ్ నాన్నలో నాని కి జోడి గా అందాల తార మృణాల్ ఠాకూర్ నటించింది. సీతారామంలోని సీత క్యారక్టర్ ని మర్చిపోయేలా ఈ మూవీలో యష్ణ అనే క్యారెక్టర్లో ఆమె నటించిన తీరు చాలా అధ్బుతంగా ఉంటుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సినీ అభిమానుల్లో పండుగ వాతావరణం తెచ్చింది.
హాయ్ నాన్న మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి లో సందడి చేయనుంది. సినిమా రిలీజ్ కి ముందే హాయ్ నాన్న డిజిటల్ హక్కులని ఇండియా వైడ్ గా ప్రదర్శించే హక్కులని నెట్ ఫ్లిక్స్ సంస్థ 35 కోట్లకి పైగానే చెల్లించి తమ సొంతం చేసుకుంది. ఇప్పటికి థియేటర్ లలో మంచి వసూళ్లనే రాబడుతున్న ఈ మూవీ ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. అలాగే సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు.

ఎప్పుడు చనిపోతుందో తెలియని కూతురు ప్రాణాల కోసం పరితపించే పాత్రలో నాని చాలా పవర్ ఫుల్ గా నటించాడు.మూవీ చూసిన ప్రతి వాళ్ళు కూడా నాని నటనని మెచ్చుకోకుండా ఉండరు. అంతలా ఆయన తన పాత్రకి ప్రాణం పోసాడు. అలాగే తనకి ఒక భర్త ,కూతురు ఉండి కూడా గతాన్ని మర్చిపోయి మళ్ళీ వాళ్ళతోనే కొత్తగా ట్రావెల్ అయ్యే పాత్రలో మృణాల్ నటన, తల్లి ఆరోగ్యం కోసం నువ్వే నా అమ్మవని చెప్పకుండా తన మనసులోనే ఆ భాదనంతా దిగమింగుకొనే పాత్రల్లో చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా ల నటన మన మనసుల్లోకి చొచ్చుకొని పోతుంది. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హాయ్ నాన్నని వైరా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై చెరుకూరి మోహన్ విజేందర్ రెడ్డి, మూర్తి లు నిర్మించారు.
![]() |
![]() |