![]() |
![]() |

గ్లామర్ ఫీల్డ్ పైకి కనిపించే అంత కలర్ ఫుల్ గా ఉండదు. హీరోయిన్ లకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా అవుట్ డోర్ షూటింగ్ టైంలో దుస్తులు మార్చుకోవడం నటీమణులకు బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటన విషయంలో ఓ నటిపై జూనియర్ ఎన్టీఆర్ కోప్పడ్డాడు.
'ప్రయాణం' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన పాయల్ ఘోష్.. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'ఊసరవెల్లి' చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ పై ఎంతో అభిమానాన్ని పెంచుకున్న పాయల్.. తాజాగా ఆయన గురించి ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది.

"నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒకసారి థాయ్‌లాండ్‌లో ఎన్టీఆర్ నాపై కోప్పడ్డారు. ఎందుకంటే నేను రోడ్డుపై దుస్తులు మార్చుకున్నాను. దక్షిణాది ప్రజలు మహిళలను ఎంతో గౌరవిస్తారు, అందుకే కోప్పడ్డారు." అంటూ పాయల్ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ "ఎన్టీఆర్ ఎప్పుడూ ఆడవాళ్లను గౌరవిస్తారు" అని కామెంట్ చేయగా.. "అవును" అంటూ పాయల్ రిప్లై ఇచ్చింది.
![]() |
![]() |