![]() |
![]() |

సలార్ సినిమా మంచి టాక్ తో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తు ఉంది. ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ ని సాధించిన సలార్ ని ప్రభాస్ ఫాన్స్ అయితే రిపీటెడ్ గా చూస్తు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సలార్ సాధించిన ఘన విజయానికి చిరంజీవి లాంటి టాప్ స్టార్ కూడా ప్రభాస్ ని అభినందించాడు. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం సలార్ మీద షాకింగ్ కామెంట్స్ చేస్తుంది.
పాయల్ ఘోష్.. ఇప్పుడు బాలీవుడ్ లో ఫైర్ ఆఫ్ లవ్ అనే సినిమా చేస్తుంది. అలాగే హిందీలో మరిన్ని చిత్రాలతో కన్నడ ఇంగ్లీష్ భాషల్లో కూడా సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే పాయల్ నిన్న సోషల్ మీడియా వేదికగా సలార్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సాలార్ సినిమా చూశానని అదొక చెత్త సినిమా కాకపోతే ప్రభాస్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కాబట్టి కలెక్షన్స్ బాగానే వస్తాయి అని చెప్పుకొచ్చింది. అలాగే షారుఖ్ నటించిన డంకీ సినిమా ని కూడా ఈ అమ్మడు వదలలేదు.డంకీ కూడా ఒక చెత్త సినిమా ఆ చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కీ మొట్టమొదటి ప్లాప్ వచ్చిందని చెప్పుకొచ్చింది.అలాగే షారుక్ గత చిత్రాలైన పఠాన్, జవాన్ లు కూడా చెత్త సినిమాలని చెప్పింది.ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సెగలు భారతీయ చిత్ర సీమలో సెగలు పుట్టిస్తున్నాయి.
పాయల్ ఘోష్ గతంలో ఒకసారి దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనని చాలా వేధించాడని సంచలనం సృష్టించింది. తెలుగులో 2011 లో ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఉసిరివెళ్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా పాయల్ నటించింది. ఇక ఆ తర్వాత ఆమె ఏ తెలుగు సినిమాలోను నటించలేదు.
![]() |
![]() |