![]() |
![]() |
.webp)
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం మూవీకి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో ఒక సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కాబోతున్న ఈ మూవీ నూటికి నూరు పాళ్ళు ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయం మహేష్ ఫ్యాన్స్ లో అయితే చాలా బలంగా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో మహేష్ గురించి వస్తున్న ఒక వార్తని ఫ్యాన్స్ చాలా నిశీతంగా గమనిస్తున్నారు.
మహేష్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని తన భార్య నమ్రత పిల్లలతో కలిసి ఫారెన్ లో చేసుకోబోతున్నాడు. కాకపోతే వారంతా ఏ ప్రదేశంలో సెలెబ్రేషన్స్ చేసుకోబోతున్నారనే సమాచారం మాత్రం లేదు. ఇప్పుడు జరుగుతున్న సాంగ్ షూట్ మరి కొన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సాంగ్ అవ్వగానే మహేష్ తన ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ వెళ్తాడు.అలాగే ఇంతకు ముందు చాలా సార్లు కూడా మహేష్ నూతన సంవత్సర వేడుకల్ని ఫ్యామిలీ తో కలిసి ఇతర దేశాల్లో జరుపుకున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నగుంటూరు కారంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి లు కథనాయికలుగా నటిస్తుండగా రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. థమన్ సంగీత సారథ్యంలో వస్తున్న ఈ మూవీలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యి మారుమోగిపోతున్నాయి.
![]() |
![]() |