![]() |
![]() |
.webp)
సలార్ మూవీ సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టేంతవరకు సలార్ ఎప్పుడొస్తుందా అని ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు సలార్ ల్యాండ్ అయిన తర్వాత సలార్ కలెక్షన్స్ గురించి చర్చించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు సలార్ సినిమాకి ప్రశాంత్ నీల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకొని ఉంటాడనే చర్చ కూడా జరుగుతుంది.
సలార్ కి ప్రశాంత్ 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కాకపోతే ఆ రెమ్యునరేషన్ సలార్ రెండు పార్టులకి కలిపా లేక మొదటి పార్ట్ వరకేనా అనే వార్తల్లో మాత్రం క్లారిటీ లేదు. సలార్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ సృష్టిస్తు తెలుగు వాడి సత్తాని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే పనిలో బిజీ గా ఉంది. సలార్ అంతటి ఘన విజయం సాధించడానికి ప్రభాస్ పవర్ ఫుల్ యాక్టింగ్ తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభ కూడా అందుకు కారణం..
సలార్ కలెక్షన్స్ మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేవు.ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో థియేటర్స్ లు దర్శనం ఇస్తున్నాయి. మొదటి రోజు 180 కోట్లు కొల్లగొట్టిన సలార్ రెండో రోజు 150 కోట్లు పైగానే రాబట్టింది.ఈ కలెక్షన్స్ ఇలాగె కొనసాగితే 1000 కోట్లు మార్కు ని అందుకోవడం పెద్ద కష్టమైన పని కాదని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. కాగా ప్రభాస్ బాహుబలి సినిమా దగ్గరనుంచి తన ప్రతి సినిమాకి 100 కోట్లు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నాడు.
![]() |
![]() |