![]() |
![]() |

ఈ ఏడాది 'దసరా', 'హాయ్ నాన్న' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత నాని 'హిట్-3'లో నటిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టే అవకాశముంది.
నానికి చెందిన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో రూపొందే హిట్ ప్రాంఛైజ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ ప్రాంఛైజ్ లో ఇప్పటిదాకా రెండు సినిమాలు రాగా, రెండూ మంచి విజయాలు సాధించాయి. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ నటించారు. మూడో భాగంలో నాని నటించనున్నాడు. ఇప్పటికే హిట్-2 చివరిలో నాని పాత్ర పరిచయమై ప్రేక్షకులను మెప్పించింది. దీంతో హిట్-3 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే హిట్ ప్రాంఛైజ్ దర్శకుడు శైలేశ్ కొలను మాత్రం.. హిట్-3 కి సమయముంది అంటున్నాడు.
'హిట్-2' తర్వాత శైలేశ్ కొలను.. వెంకటేష్ తో 'సైంధవ్' స్టార్ట్ చేశాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. దీని తర్వాత కూడా హిట్-3 మొదలు పెట్టకుండా మరో సినిమా చేస్తాడట. హిట్-3 కంటే ముందు మరో చిత్రం చేస్తానని, ప్రస్తుతం నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ బ్యానర్స్ లో కమిట్ మెంట్స్ ఉన్నాయని తాజాగా శైలేశ్ కొలను తెలిపాడు.
![]() |
![]() |