![]() |
![]() |

ఒక యువతి నడుపుతున్న మహీంద్రా థార్ కారు అదుపు తప్పి, జూబ్లీహిల్స్‌లోని హీరో బాలకృష్ణ ఇంటిమీదకు దూసుకువచ్చి, గేటు పక్కనున్న గ్రిల్‌ను ఢీకొట్టిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళం, ట్రాఫిక్ జామ్ నెలకొన్నాయి. పోలీసులు జరిపిన పరీక్షలో ఆ యువతి ఆల్కహాల్ సేవించలేదని తేలింది. ఇంటి యజమానులు ఫిర్యాదు చేయకపోవడంతో, ఈ వ్యవహారంలో ఎలాంటి కేసూ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫెన్సింగ్ విరగడంతో దానికి నష్టపరిహారం చెల్లించడానికి కారును డ్రైవ్ చేస్తున్న యువతి అంగీకరించినట్లు చెప్తున్నారు.
ఆ రూట్‌లో వేగంగా వెళ్తున్న ఒక అంబులెన్స్‌కు దారి ఇచ్చే క్రమంలో ఆ యువతి తన కారును ఎడమవేపుకు తీసుకువచ్చింది. ఈ క్రమంలో కారు అదుపుతప్పి, బాలకృష్ణ ఇంటి గేటు పక్కనున్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. దాంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడే సిగ్నల్స్ దగ్గర డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వచ్చి, పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనుమానంతో పోలీసులు ఆ యువతికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా, నెగటివ్ అని తేలింది. దాంతో ఆమెపై ఎలాంటి కేసూ పోలీసులు నమోదు చేయలేదు.
![]() |
![]() |