![]() |
![]() |

నటభూషణ శోభన్ బాబుకి కలిసొచ్చిన దర్శకుల్లో కె.ఎస్. ప్రకాశ రావు ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు తెలుగు ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి. వాటిలో `జీవితం` ఒకటి. మ్యూజికల్ గా విశేషంగా అలరించిన ఈ చిత్రంలో శోభన్ బాబుకి జంటగా శారద నటించగా కృష్ణంరాజు, జయంతి, విజయభాను, ఉదయలక్ష్మి, వివేకా నంద మూర్తి, జ్యోతిలక్ష్మి, బేబి డాలి, బేబి సరళ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. నాగయ్య, రమణా రెడ్డి అతిథి పాత్రల్లో మెరిశారు. సి. ఆనంద రామమ్ కథను అందించిన ఈ చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణ సంభాషణలు సమకూర్చారు.
రమేశ్ నాయుడు సంగీతమందించిన ఈ చిత్రానికి సి. నారాయణ రెడ్డి సాహిత్యమందించారు. ఇందులోని ``ఇక్కడే కలుసుకున్నాము``, ``మామిడి తోపుల్లోన`` పాటలు విశేషాదరణ పొందగా.. ``అంతేనేమో అది గిలిగింతేనేమో``, ``చిన్నారి ఓ బాబు``, ``తొలిరేయి ఇది తొలి రేయి`` అంటూ మొదలయ్యే గీతాలు కూడా రంజింపజేశాయి. శ్రీధర్ ప్రొడక్షన్స్ సమర్పణలో సూర్యచంద్ర రావు, బండారు గిరిబాబు నిర్మించిన `జీవితం`.. 1973 మే 18న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 49 వసంతాలు పూర్తిచేసుకుని 50లోకి అడుగుపెట్టింది.
![]() |
![]() |