![]() |
![]() |

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ 'శేఖర్'. ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ 'జోసెఫ్'కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న(మంగళవారం) సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. "చావు అంచులవరకు వెళ్లి మళ్ళీ కోలుకొని వచ్చి ఈ సినిమా చేయగలిగాను. మీ ఆశీస్సులే నన్ను బతికించాయి. అలాగే ఈ సినిమా చూసి మా బతుకుదెరువుని కూడా బతికించండి. చాలామంది యూత్ 'మా అమ్మానాన్న మీకు పెద్ద ఫ్యాన్స్ సార్' అని చెబుతుంటారు. వాళ్లందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే.. మీ మమ్మీ డాడీని థియేటర్ కి తీసుకెళ్లి సినిమా చూపించండి. ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అని అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ.. "ఆహుతి, అంకుశం, మగాడు, తలంబ్రాలు వంటి సూపర్ హిట్లతో రాజశేఖర్ గారు పీక్ లో ఉన్నప్పుడు ఆయనకు నేను వీరాభిమానిని. ఆ టైంలో నేను రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసేవాడిని. అలా మా ఊళ్ళో చాలా ఫేమస్ అయ్యాను. నేను కూడా సినిమాల్లోకి రాగాలను, ఏదైనా చేయగలను అని నమ్మకం కలగడానికి రాజశేఖర్ గారే కారణం. సినిమాతో నాకు అనుబంధం ఏర్పడటానికి కారణమైన రాజశేఖర్ గారికి బిగ్ థాంక్స్. ఒకవైపు ఫ్యామిలీని, మరోవైపు డైరెక్షన్ తో పాటు మిగతా సినిమా బాధ్యతలను చూసుకుంటున్న జీవితా గారికి హ్యాట్సాఫ్. ఆమె కోసం, ఆమె పడుతున్న కష్టం కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

జీవిత మాట్లాడుతూ.. " నేనొక సాధారణ మహిళని. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఎదురవుతున్న పరిస్థితులపై పోరాడుతూనే ఉన్నాను. ఇప్పటిదాకా నాకు తోచినంత సాయం చేశాను గాని ఎవరిని మోసం చేయలేదు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ థాంక్స్. ఒకరికొకరు ఇలా సహాయం చేసుకుంటూ చేయూతనిస్తే.. ప్రతి ఒక్కరం ఆనందంగా ఉంటాం. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కి రావట్లేదు, ఓటీటీలకు అలవాటు పడ్డారని అందరూ భయపెడుతున్నారు. కానీ ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారు.. అలాగే ఈ సినిమాని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. అధిక టికెట్ ధరలు కారణంగా ప్రేక్షకుల థియేటర్స్ కి రావట్లేదని విన్నాను. కోట్లు ఖర్చు పెట్టిన తీసిన పెద్ద సినిమాలకు తప్పదు.. కానీ మాది చిన్న సినిమా. మా సినిమాకి టికెట్ రేట్లు పెంచట్లేదు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ సినిమా టికెట్లు అందుబాటులో ఉంటాయి" అని అన్నారు.
![]() |
![]() |