![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరు జట్టుకట్టిన సినిమాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. వాటిలో `ఒంటరి పోరాటం` ఒకటి. వెంకీకి జంటగా శ్వేత, రూపిణి నటించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో `సహజనటి` జయసుధ ఓ ముఖ్య భూమిక పోషించగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అతిథి పాత్రలో మెరిశారు. సత్యనారాయణ, బ్రహ్మానందం, సుధాకర్, ఆనంద్ రాజ్, ప్రసన్న కుమార్, పీజే శర్మ, అన్నపూర్ణ, శుభ, డబ్బింగ్ జానకి, మమత ఇతర కీలక పాత్రల్లో దర్శనమిచ్చారు. సూర్యదేవర రామ్మోహనరావు కథను అందించగా మరుధూరి రాజా సంభాషణలు సమకూర్చారు.
చక్రవర్తి బాణీలు కట్టిన ఈ సినిమాకి వేటూరి సుందరరామమూర్తి, జొన్నవిత్తుల పదరచన చేశారు. ``పెదవి మీద ముద్దు``, ``నువ్వు రెడీ నేను రెడీ``, ``పడాలి ప్రేమలోన``, ``టిప్ టాప్ సోకులాడి``, ``మేడలోద్దు మిద్దెలొద్దు``.. ఇలా ఇందులోని గీతాలన్నీ ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ ప్రసన్న ఎంటర్ ప్రైజెస్ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన `ఒంటరిపోరాటం`.. 1989 మే 18న విడుదలై విజయం సాధించింది. నేటితో ఈ సినిమా 33 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |