![]() |
![]() |

ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన 'గాడ్సే' మూవీ మరోసారి వాయిదా పడింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన గాడ్సే సినిమాని మే 20న విడుదల చేస్తున్నట్లు ఏప్రిల్ రెండో వారంలో ప్రకటించారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వకపోవడంతో ఈ సినిమా మళ్ళీ వాయిదా పడినట్లేనని భావించారంతా. అనుకున్నట్లుగానే ఈ సినిమాని వాయిదా వేస్తూ మరో కొత్త తేదీని ప్రకటించింది మూవీ టీమ్.
యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'గాడ్సే'. సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీగణేష్ పట్టాభి దర్శకుడు. గతంలో సత్యదేవ్, గోపీగణేష్ కాంబినేషన్ లో వచ్చిన 'బ్లఫ్ మాస్టర్' ఘన విజయాన్ని సాధించడంతో.. 'గాడ్సే'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దానికితోడు టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా కోసం మరికొంత కాలం ఎదురు చూడక తప్పదంటూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. జూన్ 17న ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో గన్స్ పట్టుకొని నడుస్తున్న సత్యదేవ్ లుక్ పవర్ ఫుల్ గా, ఆకట్టుకునేలా ఉంది.

ప్రస్తుతం సత్యదేవ్ పలు సినిమాలలో నటిస్తున్నాడు. 'గాడ్సే'తో పాటు 'గుర్తుందా శీతాకాలం' విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'గాడ్ ఫాదర్'లో కీలక పాత్రలో నటిస్తున్న సత్యదేవ్.. అక్షయ్ కుమార్ తో 'రామ్ సేతు' అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నాడు.
![]() |
![]() |