![]() |
![]() |

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సర్కారు వారి పాట'. మే 12న విడుదలైన ఈ సినిమా నెగటివ్ టాక్, నెగటివ్ రివ్యూలతో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతోందని మేకర్స్ చెబుతున్నారు. గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించడమే కాకుండా.. ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ రాబట్టిందని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు మహేష్ కూడా ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ అద్భుతమైన చిత్రాన్ని తనకి ఇచ్చినందుకు డైరెక్టర్ పరశురామ్ కి థాంక్స్ చెబుతూ తాజాగా ట్వీట్ చేశాడు.
'సర్కారు వారి పాట' వంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు పరశురామ్ కి, మొత్తం మూవీ టీమ్ కి బిగ్ థాంక్స్ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. తనకు 'సర్కారు వారి పాట' ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నాడు. అలాగే, ఇంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ఫ్యాన్స్ కి కూడా మహేష్ స్పెషల్ థాంక్స్ చెప్పాడు.

మహేష్ ట్వీట్ కి పరశురామ్ రిప్లై ఇచ్చాడు. 'సర్కారు వారి పాట' తన లైఫ్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని అన్నాడు. ఈ జర్నీలో మీరు(మహేష్) నాపై చూపిన ప్రేమ, నమ్మకాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని.. మళ్ళీ మీతో కలిసి పని చేయడం కోసం ఎదురుచూస్తున్నానని పరశురామ్ రిప్లై ఇచ్చాడు.
మహేష్ ట్వీట్, పరశురామ్ రిప్లై ప్రస్తుతం వైరల్ గా మారాయి. మహేష్ ఫ్యాన్స్ పరశురామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. వింటేజ్ మహేష్ ని మాకు చూపించారు.. వెంటనే మహేష్ తో ఇంకో సినిమా తీయండి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |