![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా సినిమాలకే కాకుండా పెద్ద హీరోల అన్ని సినిమాలతో పాటు ఇతర భాషల భారీ సినిమాలకు కూడా విడుదలైన కొద్దిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు అధికంగా ఉండగా.. దానికి అదనంగా మరింత పెంచడం పట్ల ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక టికెట్ ధరల కారణంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు థియేటర్స్ కి వెళ్లడం తగ్గిస్తున్నారు. దీంతో అసలుకే మోసం వచ్చి పలు సినిమాలు భారీ నష్టాలను చూస్తున్నాయి. ఈ దెబ్బతో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దిగొస్తున్నారు.
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'F3'. దిల్ రాజు ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'F2'కి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టడంతో భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్ కావడంతో 'F3'పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన పలు సినిమాల టికెట్ ధరలు పెంచారు. ఈ క్రమంలో 'F3'కి కూడా పెంచే అవకాశముందని, అదే జరిగితే ఫ్యామిలీ ఆడియన్స్ రావడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమైంది. అయితే 'F3' సినిమాకి టికెట్ ధరలు పెంచట్లేదని తాజాగా దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే 'F3' సినిమా టికెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. సాధారణ టికెట్ రేట్లతోనే ఈ సినిమా వస్తుందని, ప్రశాంతగా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చని దిల్ రాజు తెలిపారు.
'F3'లో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించగా.. సునీల్, సోనాల్ చౌహాన్, అంజలి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
![]() |
![]() |