![]() |
![]() |
.webp)
తెలుగునాట `శ్రీకృష్ణుడు` పాత్రలకు పెట్టింది పేరు.. నటరత్న నందమూరి తారక రామారావు. శ్రీకృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ అలరించిన సినిమాల్లో `శ్రీకృష్ణాంజనేయ యుద్ధం` ఒకటి. తాండ్ర సుబ్రమణ్యం రచించిన `శ్రీకృష్ణాంజనేయ యుద్ధం` నాటకం ఆధారంగా ఈ మైథలాజికల్ మూవీని తెరకెక్కించారు ప్రముఖ దర్శకుడు సి.ఎస్. రావు. నిజజీవితంలో హనుమభక్తుడైన రాజనాల.. ఇందులో ఆంజనేయులుగా నటించడం విశేషం. టైటిల్ రోల్స్ లో నటించిన రామారావు, రాజనాల మధ్య సాగే సన్నివేశాలే ఈ చిత్రానికి ప్రధాన బలం.
సత్యభామగా వాణిశ్రీ, రుక్మిణిగా దేవిక, బలరామగా ఎస్వీ రంగారావు, నారదుడిగా కాంతారావు కనిపించిన ఈ చిత్రంలో చిత్తూరు వి. నాగయ్య, రాజబాబు, ధూళిపాల, మిక్కిలినేని, ముక్కామల, త్యాగరాజు, శాంతకుమారి, హేమలత, రోజారమణి, సంధ్యా రాణి, వై. విజయ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. టి.వి. రాజు సంగీతమందించిన ఈ సినిమాకి సి. నారాయణరెడ్డి, సముద్రాల జూనియర్ సాహిత్యమందించారు. పూర్ణిమ పిక్చర్స్ పతాకంపై డి.ఎన్. రాజు నిర్మించిన `శ్రీకృష్ణాంజనేయ యుద్ధం`.. 1972 మే 18న విడుదలైంది. కాగా, నేటితో ఈ చిత్రం 50 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |