![]() |
![]() |

అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా 'డేంజరస్'. లెస్బియన్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 8 న విడుదల కావాల్సి ఉంది. అయితే నట్టికుమార్ ఫ్యామిలీ ఈ సినిమా విడుదలను అడ్డుకుంది. ఆర్జీవీ తమకి రూ.5 కోట్లు ఇవ్వాలని, అవి ఇచ్చేవరకు సినిమా విడుదల ఆపాలంటూ సివిల్ కోర్టుకి వెళ్లి స్టే తెచ్చారు. దీంతో 'డేంజరస్' సినిమా విడుదలకి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మరో కొత్త తేదీకి సినిమా విడుదల కానుంది. అంతేకాదు ఫోర్జరీ డాక్యుమెంట్ తో తప్పుడు ఆరోపణలు చేసిన నట్టి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ తాజాగా ఆర్జీవీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
"గత కొద్ది రోజులుగా మీడియా లో చక్కర్లు కొడుతున్న నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణ ల విషయమై ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను.
ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని ఆపటానికి నట్టి క్రాంతి, నట్టి కరుణలు కుట్ర పన్ని, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. ఆ క్రింది కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ఆర్డర్ ని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది
నేను ఇప్పుడు నట్టి క్రాంతి, నట్టి కరుణ ల మీద ఫోర్జరీ కి సంబంధించిన కేసే కాకుండా, వివిధ మీడియా ఛానళ్లలో నా పై చేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి నట్టి క్రాంతి, నట్టి కరుణ ల ఫాదర్ అయినటువంటి నట్టి కుమార్ మీద నేను, తుమ్మలపల్లి రామత్యనారాయణ గారు డిఫేమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ని ఉపయోగించి సినిమా ని ఆపి మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు కూడా వాళ్ల మీద డ్యామేజ్ కేసు వెయ్యబోతున్నాము.
ఇప్పుడు విడుదల చేసేందుకు క్లియరెన్స్ ఆర్డర్ వచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని మే 6 న విడుదల చెయ్య బోతున్నాము. దానికి సంబంధించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ లు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము.

ఫోర్జరీ చేసి, దానిని నిజమైన డాక్యుమెంట్‌గా ఉపయోగించడం ద్వారా నట్టి క్రాంతి, నట్టి కరుణ లు చేసిన క్రిమినల్ చర్యలకి సంబంధించిన విషయాలు, అలాగే పైన పేర్కొన్న ఇంజక్షన్-ఆర్డర్‌ను నట్టిలు సేకరించిన విధానం, యంత్రాంగాన్ని దుర్వినియోగ పరుచుకున్న తీరు నట్టి ఫ్యామిలీ యొక్క నేరపూరిత స్వభావాన్ని తెలియజేస్తుంది
ఈ ప్రెస్ నోట్ తప్ప, ఇకపై నేను ఈ విషయంపై ఇంకేం మాట్లాడబోను.. జస్ట్ వాళ్ల పైన చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతాను.. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయట పడబోతోంది." అంటూ ఆర్జీవీ నోట్ రిలీజ్ చేశారు. మరి దీనిపై నట్టి ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
![]() |
![]() |