![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అప్పట్లో ఈ మూవీ టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే.. ఒక సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న చిరంజీవి మాటల్లో తన తదుపరి చిత్రం 'ఆచార్య' అంటూ పొరపాటున టైటిల్ లీక్ చేశాడు. తాజాగా చిరంజీవి మరో సినిమా టైటిల్ కూడా అలాగే అయింది. అయితే ఈసారి సినిమా టైటిల్ లీక్ చేసే బాధ్యతను శేఖర్ మాస్టర్ తీసుకున్నాడు.
ప్రస్తుతం మెగాస్టార్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అందులో యంగ్ డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) రూపొందిస్తున్న 'మెగా 154' ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ఫిక్స్ చేశారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ మేకర్స్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా శేఖర్ మాస్టర్ టంగ్ స్లిప్ అయ్యి టైటిల్ లీక్ చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్.. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ.. "రవితేజగారు నటిస్తున్న 'ధమాకా', 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలు, తమిళ్ లో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అలాగే చిరంజీవి గారితో 'భోళా శంకర్', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు చేస్తున్నాను" అంటూ నోరు జారాడు. దీంతో 'మెగా154 ' టైటిల్ 'వాల్తేరు వీరయ్య' అని కన్ఫర్మ్ అయినట్టే అంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో.. మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
![]() |
![]() |