![]() |
![]() |

'కేజీఎఫ్ చాప్టర్-2' భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఆరో రోజు వరల్డ్ వైడ్ గా 25 కోట్లకు పైగా షేర్, 50 కోట్లకు పైగా రాబట్టి సత్తా చాటింది. ఆరో రోజు కలెక్షన్స్ పరంగా చూస్తే 'ఆర్ఆర్ఆర్'కి మించిన కలెక్షన్స్ 'కేజీఎఫ్-2'కి రావడం విశేషం. ఆర్ఆర్ఆర్ ఆరోరోజు(బుధవారం) 23.19 కోట్ల షేర్(45 కోట్ల గ్రాస్) వసూలు చేస్తే.. కేజీఎఫ్-2 ఆరోరోజు(మంగళ వారం) 25.12 కోట్ల షేర్(52.35 కోట్ల గ్రాస్) రాబట్టింది. దీంతో కేజీఎఫ్-2 వరల్డ్ వైడ్ గా 336.27 కోట్ల షేర్(676.15 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా 345 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ నేడు బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు 3.51 కోట్ల షేర్ రాబట్టిన కేజీఎఫ్-2 ఆరు రోజుల్లో 62.17 కోట్ల షేర్(98.50 కోట్ల గ్రాస్) రాబట్టింది. నేడు తెలుగు స్టేట్స్ లో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోనుంది. ఆరో రోజు ఆంధ్రాలో 1.3 కోట్లు, తెలంగాణలో 1.68 కోట్లు, రాయలసీమలో రూ.0.53 కోట్లను 'కేజీఎఫ్ 2' రాబట్టింది. మొత్తంగా చూస్తే.. ఆరు రోజులకు ఈ సినిమా ఆంధ్రాలో 21.16 కోట్లు, తెలంగాణలో 32.31 కోట్లు, రాయలసీమలో 8.70 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఆరు రోజుల్లో కర్ణాటకలో 62.80 కోట్లు(100 కోట్లు బిజినెస్), తెలుగు రాష్ట్రాల్లో 62.17 కోట్లు(78 కోట్లు బిజినెస్), తమిళనాడు 20.70 కోట్లు(27 కోట్లు బిజినెస్), కేరళ 16.15 కోట్లు(10 కోట్లు బిజినెస్), హిందీ+రెస్టాఫ్ ఇండియా 120.10 కోట్లు(100 కోట్లు బిజినెస్), ఓవర్సీస్ 54.35 కోట్ల(30 కోట్లు బిజినెస్) షేర్ రాబట్టింది. ఇప్పటికే కేరళ, నార్త్, ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన కేజీఎఫ్-2 త్వరలోనే మిగతా చోట్లా ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది.
![]() |
![]() |