![]() |
![]() |

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం `ప్రాజెక్ట్ కె`. `ఎవడే సుబ్రమణ్యం`, `మహానటి` సినిమాల దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ పాన్ - వరల్డ్ మూవీని వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత సి. అశ్వనీదత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణ్ నటిస్తోంది.
ఇదిలా ఉంటే, `ప్రాజెక్ట్ కె`లో అమితాబ్, ప్రభాస్ పాత్రలకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో అశ్వథ్థామ అనే ఓ వ్యాపారవేత్తగా అమితాబ్ బచ్చన్ కనిపించనుండగా.. అతనికి కొడుకుగా ప్రభాస్ దర్శనమివ్వనున్నాడట. ఇక దీపిక పాత్ర విషయానికి వస్తే.. అమితాబ్ కి సహాయకురాలిగా నటిస్తోందని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also Read: 'రాధేశ్యామ్' దెబ్బ.. దిల్ రాజు అబ్బా
కాగా, మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్న `ప్రాజెక్ట్ కె` ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది. 2023 ద్వితీయార్ధంలో లేదా 2024 ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చే అవకాశముంది.
![]() |
![]() |