![]() |
![]() |

ఇటీవల 'ఖిలాడి' సినిమాతో నిరాశపరిచిన మాస్ మహారాజ రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'తో లెక్క సరి చేయడానికి రెడీ అవుతున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రజిషా విజయన్, దివ్యాంషు కౌశిక్ హీరోయిన్స్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ'ని మార్చి 25 లేదా ఏప్రిల్ 15 న విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. మార్చి 25 న 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఉండటంతో ఏప్రిల్ 15 న రామారావు వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వెనక్కి వెళ్ళిపోయింది. జూన్ 17 న మూవీని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు.

కాగా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా', సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ పట్టాలెక్కనుంది.
![]() |
![]() |