![]() |
![]() |

కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, హీరోయిన్ నయనతార కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట తరచూ వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకుంటున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్దరూ పోలీస్ కేసులో చిక్కుకున్నారంటూ ఓ న్యూస్ వినిపిస్తోంది.
'రౌడీ పిక్చర్స్' అనే బ్యానర్ పై విఘ్నేష్, నయనతార సినిమాలు నిర్మిస్తుంటారు. అయితే తాజాగా ఈ నిర్మాణ సంస్థపై పోలీస్ కేసు నమోదైందని తెలుస్తోంది. రీసెంట్ గా విఘ్నేష్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా 'AK62' సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా 'రౌడీ పిక్చర్స్' టీమ్ ఆధ్వర్యంలో భారీగా బాణసంచా(క్రాకర్స్) కాల్చారట. వారి సెలెబ్రేషన్స్ తో చుట్టు పక్కల ప్రజలను డిస్ట్రబ్ చేశారని, సామాన్య ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారని ఆరోపిస్తూ కన్నన్ అనే ఓ సోషల్ యాక్టివిస్ట్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారట. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై విఘ్నేష్, నయనతారల వివరణ తీసుకోకున్నారని సమాచారం.
విఘ్నేష్, నయనతార కాంబినేషన్ లో 'కాతువాకుల రెండు కాదల్' అనే మూవీ రానుంది. రౌడీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి విఘ్నేష్ దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి, నయనతార, సమంత లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |