![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెండితెరపై వినోదాలు పంచి మూడేళ్ళు దాటింది. `అరవింద సమేత వీర రాఘవ`(2018) తరువాత `ఆర్ ఆర్ ఆర్`పైనే పూర్తిగా దృష్టి సారించాడు తారక్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ వేసవి కానుకగా మార్చి 25న థియేటర్స్ లోకి రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తారక్ కి వేసవితో మంచి అనుబంధమే ఉంది. తను బాలనటుడిగా నటించిన `బ్రహ్మర్షి విశ్వామిత్ర` (1991), `రామాయణం` (1997) ఇదే సీజన్ లో విడుదల కాగా.. కథానాయకుడిగా పరిచయమైన `నిన్ను చూడాలని` (2001) కూడా సమ్మర్ స్పెషల్ గానే ఎంటర్టైన్ చేసింది. అంతేకాదు.. తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన `ఆది` (2002) కూడా వేసవిలోనే వినోదాలు పంచింది. ఆపై మరికొన్ని సినిమాలతో సమ్మర్ సీజన్ లో అలరించిన ఎన్టీఆర్.. చివరసారిగా `బాద్ షా` (2013)తో వేసవిలో పలకరించాడు. కట్ చేస్తే.. తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మళ్ళీ ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్`తో ఈ సీజన్ లో సందడి చేయబోతున్నాడు. మరి.. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న `ఆర్ ఆర్ ఆర్`తో తారక్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
కాగా, `ఆర్ ఆర్ ఆర్`ని దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేయగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో మరో హీరోగా నటించాడు.
![]() |
![]() |