![]() |
![]() |

కోలీవుడ్ యాక్టర్ ప్రశాంత్ పలు తమిళ్ సినిమాల్లో నటించి స్టార్ గా ఎదిగాడు. 'జీన్స్', 'జోడి' వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019 వచ్చిన 'వినయ విధేయ రామ' సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. ప్రస్తుతం తమిళ్ లో 'అంధధూన్' రీమేక్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే 49 ఏళ్ళ ప్రశాంత్ ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయ్యాడని తెలుస్తోంది.
ప్రశాంత్ 2005లో గృహలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే మనస్పర్థల కారణంగా కొన్నేళ్ళకే వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని సమాచారం. ఆయన కుటుంబానికి పరిచయమున్న యువతికి ప్రశాంత్ విహహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. చెన్నైకి చెందిన ఆ యువతి ప్రశాంత్ కి మంచి ఫ్రెండ్ అని, ఇరు కుటుంబాల అంగీకారంతో వీరు పెళ్లికి రెడీ అయ్యారని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చు.
ప్రస్తుతం ప్రశాంత్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అంధధూన్'కి రీమేక్ గా తెరకెక్కుతున్న 'అంధగన్'లో నటిస్తున్నాడు. ఈ క్రైమ్ కామెడీ చిత్రానికి ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. కాగా, ఇదే సినిమా తెలుగులో నితిన్ హీరోగా 'మాస్ట్రో' పేరుతో రీమేక్ అయింది.
![]() |
![]() |