![]() |
![]() |

ఎందరో హీరోలు, డైరెక్టర్లు ఓటీటీలలో వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. దగ్గుబాటి హీరోలు వెంకటేష్-రానా కాంబినేషన్ లో 'రానా నాయుడు', నాగ చైతన్య- డైరెక్టర్ విక్రమ్ కాంబోలో ఓ సిరీస్ ఇలా ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు మరో డైరెక్టర్ ఓటీటీలో అడుగుపెడుతున్నారు.
'శతమానం భవతి' సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వేగేశ్న సతీష్ 'కథలు (మీవి-మావి)' అనే వెబ్ సిరీస్ తో త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సిరీస్ నుండి మొదటి కథ 'పడవ' మోషన్ పోస్టర్ విడుదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ 'పడవ' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి దర్శకుడు వేగేశ్న సతీష్ కి అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు హీరో సమీర్ వేగేశ్న, ఈషా రెబ్బ జంటగా నటించిన 'పడవ' ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.

తాజాగా ఈ సిరీస్ నుండి మూడు కథలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మిగతా కథలు షూటింగ్ జరుపుకోనున్నాయి. త్వరలోనే వేగేశ్న సతీష్ 'కథలు' ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
![]() |
![]() |