![]() |
![]() |

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే మెగా డాటర్ నిహారిక ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసి షాక్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ అంశంపై స్పందించిన నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు.. కూతురి ఇన్ స్టా అకౌంట్ తానే డీయాక్టివేట్ చేశానని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
కొద్దిరోజుల క్రితం నిహారిక ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె తన జిమ్ ట్రైనర్ వీపుపై కూర్చొని ఉండగా అతడు పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. పెళ్లి అయిన తర్వాత ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంపై అత్తగారింట్లో ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. అందుకే నిహారిక తన ఇన్ స్టా అకౌంట్ డీయాక్టివేట్ చేసిందని వార్తలొచ్చాయి. తాజాగా ఇదే విషయం గురించి ఓ అభిమాని అడగగా.. సెటైరికల్ ఆన్సర్ ఇచ్చి తప్పించుకున్నాడు నాగబాబు.

తాజాగా సోషల్ మీడియాలో మెగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు నాగబాబు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. "నాగబాబు అంకుల్ నిహారిక అక్క ఇన్స్టా అకౌంట్ ఏమైంది? ఆ రూమర్స్ మీద రెస్పాండ్ అవండి ప్లీజ్" అని అడగగా.. నాగబాబు ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. "నేనే కోడింగ్ నేర్చుకుని హాక్ చేసి డీయాక్టివేట్ చేశా. డీకోడింగ్ నేర్చుకోగానే రీయాక్టివేట్ చేస్తాను" అంటూ బ్రహ్మనందం ఎమోజీతో రిప్లై ఇచ్చాడు.
![]() |
![]() |