Home

»

Latest News

'రాధేశ్యామ్' దెబ్బ.. దిల్ రాజు అబ్బా

Mar 22, 2022

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. 'రాధేశ్యామ్'తో టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ ఎన్నో అంచనాల నడుమ మార్చి 11 న విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. రూ.204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ ఇప్పటిదాకా 82.64 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా దెబ్బకి బయ్యర్లు దాదాపు 120 కోట్లు నష్టపోనున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా కారణంగా 20 కోట్లు నష్టపోనున్నారని తెలుస్తోంది.

'రాధేశ్యామ్'ని నైజాం(తెలంగాణ)తో పాటు ఉత్తరాంధ్రలో దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ రెండు ఏరియా రైట్స్ కలిపి దాదాపు 50 కోట్లకు దిల్ రాజు దక్కించుకోగా.. 30 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది రాధేశ్యామ్. నైజాం రైట్స్ 36.50 కోట్లకు దక్కించుకోగా.. అక్కడ ఇప్పటిదాకా 24.73 షేర్ వచ్చింది. ఉత్తరాంధ్ర రైట్స్ 13 కోట్లకు తీసుకోగా.. అక్కడ మూవీ 4.86 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇలా రెండు చోట్లా కలిపి దిల్ రాజుకి 20 కోట్ల భారీ నష్టం కలగనుంది.

'రాధేశ్యామ్' బాక్సాఫీస్ రన్ దాదాపు ముగిసినట్లే. ఈ నెల 25 న 'ఆర్ఆర్ఆర్' విడుదల ఉంది. ఆలోపు ఈ మూడు రోజుల్లో రాధేశ్యామ్ వరల్డ్ వైడ్ గా ఒక కోటి కూడా షేర్ రాబట్టే అవకాశం లేదు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com