![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - విజనరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా నటించే నాయికపై రకరకాల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న, కియారా అద్వాని, ఆలియా భట్ వంటి ప్రముఖ కథానాయికలతో పాటు ఒక దశలో దక్షిణ కొరియా నటి సుజీ బే పేరు కూడా వెలుగులోకి వచ్చింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. విజయ్ `మాస్టర్`లో నాయికగా నటించిన మాళవికా మోహనన్.. `#RC 15`లో హీరోయిన్ గా దర్శనమివ్వనుందట. త్వరలోనే చరణ్ - శంకర్ కాంబో మూవీలో మాళవికా మోహనన్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, ప్రస్తుతం మాళవికా మోహనన్ చేతిలో `ధనుష్ 43` (తమిళ్), `యుద్ర` (హిందీ) చిత్రాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఒకవేళ.. చరణ్ సినిమాకి మాళవిక గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తెలుగులో ఆమె నేరుగా నటించే మొదటి చిత్రం ఇదే అవుతుంది.
![]() |
![]() |