![]() |
![]() |

లాక్ డౌన్ లో కొందరు హీరోయిన్స్ సైలెంట్ గా పెళ్లి చేసుకొని సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ ప్రణీత ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కింది. హీరోయిన్ యామీ గౌతమ్ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను వివాహం చేసుకుంది.
యామీ గౌతమ్- ఆదిత్య ల వివాహం.. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నేడు(శుక్రవారం) జరిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగిందని, మీ ఆశీస్సులు కావాలని కోరుతూ భర్తతో కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేసింది.
కాగా యామీ గౌతమ్ ని పెళ్లాడిన ఆదిత్య మరెవరో కాదు.. 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్' మూవీ డైరెక్టర్. ప్రస్తుతం ఈయన విక్కీ కౌశల్ హీరోగా 'ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ' సినిమా చేస్తున్నాడు. ఇక యామీ గౌతమ్ విషయానికొస్తే.. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం వరుస బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది.
![]() |
![]() |