![]() |
![]() |
.jpg)
ప్రస్తుతం హీరోలు పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతూ, పార్కుల్ని దత్తత తీసుకుంటూ కనిపించిన మన టాలీవుడ్ స్టార్స్ సందర్భం వచ్చినప్పుడల్లా పర్యావరణానికి మేలుచేసే అలవాట్లను పెంపొందించుకోవాల్సిందిగా తమ అభిమానులకు పిలుపునిస్తున్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ ఇంటి ఆవరణలో ఓ మొక్కను నాటారు. దానికి నీళ్లు పోస్తూ ఫొటోకు పోజిచ్చారు. ఆ పిక్చర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
దాంతో పాటు, "#WorldEnvironmentDay, మరిన్ని చెట్లను నాటుదామని, పర్యావరణ అనుకూల అలవాట్లను అడాప్ట్ చేసుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. మనకోసం ప్రకృతి ఏం చేస్తుందనేదానిని అభినందిద్దాం, తర్వాతి తరం కోసం మన గ్రహాన్ని పచ్చటి ప్రదేశంగా మారుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. ఇది నా హృదయానికి దగ్గరైన అంశం. ఈ విషయంలో ముందడుగు వెయ్యాల్సిందిగా ఇప్పుడు నేనందర్నీ అడుగుతున్నాను. మీరు మొక్క నాటుతున్న ఫొటోను షేర్ చేయండి. వాటిలో కొన్నింటిని నేను రిషేర్ చేస్తాను. మన గ్రహాన్నికాపాడుకోవడానికి కలిసి పనిచేద్దాం." అని రాసుకొచ్చారు బన్నీ. దాంతో పాటు #GoGreenWithAA అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మహమ్మారి కారణంగా షూటింగ్‌లకు పదే పదే అంతరాయం ఏర్పడుతుండటంతో, సినిమా పూర్తవడానికి మరింత సమయం పట్టనున్నది. దీంతో పుష్ప విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది.
![]() |
![]() |