![]() |
![]() |

నటి రిచా గంగోపాధ్యాయ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని తెలియజేస్తూ తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బాబుకి ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్లు రిచా తెలిపారు.
"లుకా రాకతో మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. లుకా ఎంతో ఆరోగ్యంగా.. రూపురేఖల్లో అచ్చం తన నాన్న లాగానే ఉన్నాడు. లుకా.. నువ్వు మా జీవితాల్లో మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు" అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన రిచా.. చిన్నారి ఫోటోని కూడా షేర్ చేశారు.

కాగా, 'లీడర్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రిచా... మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నారు. ఆ తరువాత ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘మిర్చి’, ‘భాయ్’ వంటి సినిమాలతో అలరించారు. ‘భాయ్’ సినిమా తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లిన ఆమె.. అక్కడ బిజినెస్ స్కూల్ లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో జోను పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత నటనకు దూరమయ్యారు.
![]() |
![]() |