![]() |
![]() |

తక్కువ సమయంలోనే నేషనల్ వైడ్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మరోసారి తన పేరు మారుమోగేలా చేశాడు. తాజాగా ‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020’ లిస్ట్ లో నేషనల్ వైడ్ గా సెకండ్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ టైమ్స్ విడుదల చేసిన 'మోస్ట్ డిజైరబుల్ మెన్’ లిస్ట్‌లో.. వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటిన విజయ్.. ఇప్పుడు నేషనల్ వైడ్ గా సెకండ్ ప్లేస్ లో నిలవడం విశేషం.

ప్రతి ఏడాది లాగే టైమ్స్ గ్రూప్.. ఈ ఏడాది కూడా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలతో టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేయగా.. అందులో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మొదటి స్థానం దక్కించుకున్నాడు. రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచాడు. గత సంవత్సరం మూడో ప్లేస్ లో ఉన్న విజయ్.. తాజా లిస్ట్ లో బాలీవుడ్ స్టార్స్ ని, స్టార్ క్రికెటర్లను సైతం వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆదిత్య రాయ్ కపూర్, వికీ కౌశల్, దుల్కర్ సల్మాన్, విరాట్ కోహ్లీ నిలిచారు.
ఇక టాలీవుడ్ నుండి మరో హీరో కూడా ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020’ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ లో రానా దగ్గుబాటి 28వ స్థానంలో నిలిచాడు. విజయ్, రానా మినహా మరో తెలుగు హీరోకి ఈ లిస్ట్ లో చోటు దక్కలేదు.
![]() |
![]() |