![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజకి `విక్టరీ వెంకటేశ్` ఫ్యాక్టర్ బాగానే వర్కవుట్ అయింది. వెంకటేశ్ ముద్దు పేరు `వెంకీ`ని టైటిల్ గా చేసుకుని రవితేజ చేసిన `వెంకీ` (2004) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే రవితేజ రీసెంట్ బ్లాక్ బస్టర్ `క్రాక్`కి వెంకీ ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అలా.. తనకి అచ్చొచ్చిన వెంకీతో త్వరలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట రవితేజ.
ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఘనవిజయం సాధించిన `డ్రైవింగ్ లైసెన్స్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మాతృకలో సూరజ్ పోషించిన మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ పాత్రలో వెంకీ నటించనుండగా.. పృథ్వీరాజ్ ధరించిన `స్టార్ హీరో` పాత్రలో రవితేజ దర్శనమివ్వనున్నారని తెలిసింది. అంతేకాదు.. ఓ ప్రముఖ దర్శకుడు ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. త్వరలోనే వెంకీ, రవితేజ మల్టిస్టారర్ పై క్లారిటీ రానుంది.
కాగా, ప్రస్తుతం వెంకీ చేతిలో `నారప్ప`, `దృశ్యం 2`, `ఎఫ్ 3` చిత్రాలున్నాయి. ఇక రవితేజ విషయానికొస్తే.. `ఖిలాడి` చిత్రీకరణ తుది దశకు చేరుకోగా.. శరత్ మండవ డైరెక్టోరియల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే, త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు రవితేజ.
![]() |
![]() |