![]() |
![]() |

`కేజీఎఫ్`తో పాన్ - ఇండియా డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ నీల్. త్వరలో `కేజీఎఫ్` సెకండ్ పార్ట్ `కేజీఎఫ్ ఛాప్టర్ 2`తో పలకరించనున్నారు. అలాగే, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో `సలార్` చేస్తున్న నీల్.. అది పూర్తయ్యాక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో `ఎన్టీఆర్ 31`చేయబోతున్నారు. ఇవన్నీ కూడా పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ నే.
ఇదిలా ఉంటే.. ప్రభాస్, తారక్ చిత్రాల తరువాత కూడా ప్రశాంత్.. తెలుగు స్టార్ హీరోతోనే తన నెక్స్ట్ వెంచర్ చేయనున్నారట. ఆ టాప్ హీరో మరెవరో కాదు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు.. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుందని బజ్. త్వరలోనే చరణ్, ప్రశాంత్ కాంబో మూవీపై క్లారిటీ రానున్నది.
కాగా, ప్రస్తుతం చరణ్ చేతిలో `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య` చిత్రాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నాయి. అదేవిధంగా.. ఏస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేయనున్న భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇది పూర్తయ్యాకే అంటే 2022 చివరలోనే చరణ్ - ప్రశాంత్ కాంబో వెంచర్ పట్టాలెక్కే అవకాశముందని సమాచారం.
![]() |
![]() |