![]() |
![]() |

`4 లెటర్స్`, `ఊల్లాల ఊల్లాల`, `థ్రిల్లర్` చిత్రాల్లో కథానాయికగా నటించినా రాని గుర్తింపుని.. `క్రాక్`లోని `భూమ్ బద్ధల్` అంటూ చేసిన ఐటమ్ నంబర్ తో సొంతం చేసుకుంది అప్సరా రాణి. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన సదరు కాప్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో ఈ హాట్ బ్యూటీకి మరో స్వీట్ ఆఫర్ దక్కింది. ఆ స్వీట్ ఆఫరే.. `సీటీమార్`.
యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన `సీటీమార్`లో `పెప్సీ ఆంటీ` అంటూ సాగే పాటలో అంకితా రాణి చిందులేసింది. సంపత్ నంది డైరెక్ట్ చేసిన సదరు స్పోర్ట్స్ డ్రామాకి.. అప్సర చేసిన ఈ డ్యాన్స్ నంబర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని ఫిల్మ్ నగర్ బజ్. మరి.. సంక్రాంతికి `భూమ్ బద్ధల్` అంటూ బాక్సాఫీస్ ని హీటెక్కించి మరీ హిట్ కొట్టిన అప్సర.. ఈ సమ్మర్ లో `పెప్సీ ఆంటీ` అంటూ `సీటీమార్` కొట్టించి మరీ రాణిస్తుందేమో చూడాలి.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందించిన `సీటీమార్`.. ఏప్రిల్ 2న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన `సీటీమార్` టైటిల్ సాంగ్, `జ్వాల రెడ్డి` గీతాలకు మంచి ఆదరణ దక్కిన నేపథ్యంలో.. `పెప్సీ ఆంటీ`పైన కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ ఆదివారం ఉదయం 11. 17 నిమిషాలకు `పెప్సీ ఆంటీ` లిరికల్ వీడియో రిలీజ్ కానుంది.
![]() |
![]() |