![]() |
![]() |

'లవ్ జిహాద్'కి వ్యతిరేకంగా కరాటే కల్యాణీ గళం విప్పిన విషయం తెలిసిందే. ఓ అమ్మాయిని 'లవ్ జిహాద్' పేరుతో ట్రాప్‌లో పడేసిన ఓ యువకుడు ఆ తరువాత సదరు యువతిని చిత్ర హింసలకు గురిచేసి తలాక్ చెప్పాడని ఇటీవల కరాటే కల్యాణి ఓ వీడియోను తన ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కరాటే కల్యాణి సాయంతో ఆ యువతి పోలీసుల్ని సంప్రదించింది. అయితే ఈ విషయంపై హిందూ సంఘాలు కల్యాణిపై విరుచుకుపడ్డాయి.
అన్యాయానికి గురైన యువతి హిందువు కావడంతో గుంటూరులో కొన్ని సంఘాల వారు మీడియా ముందు మాట్లాడటానికి పోటీ పడ్డాయి. ఇదంతా చేసింది కరాటే కల్యాణి అని, ఈ వివాదాన్ని తన పబ్లిసిటీ కోసం వాడుకుంటోందంటూ ఆమెపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన కరాటే కల్యాణి ఆ సంఘాలని, ఆ సంఘాల నాయకుల్ని ఫేస్ బుక్ లైవ్‌లో ఏకి పారేశారు.
ఇదే సందర్భంగా గుంటూరుకు చెందిన సిడింబి ప్రసాద్‌కు వార్నింగ్ ఇచ్చారు. హిందూ ధర్మంతో వ్యాపారం చేస్తున్నాడంటూ ఆయనపై ఘాటుగా విమర్శలకు దిగారు. ఆయనను ధర్మద్రోహి అని విమర్శించారు. తాను ఎక్కడ తప్పు చేశానో దమ్ముంటే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. అంతే కాకుండా ఓ యువతి అన్యాయం అయిపోయిందని, తనకు న్యాయం చేయాలని ముందుకు వస్తే తనపై అభాడాలు వేస్తారా అని లైవ్‌లో ఏడ్చేశారు.
![]() |
![]() |