![]() |
![]() |

`రుద్రమదేవి` (2015) తరువాత వెటరన్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందిస్తున్న మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ `శాకుంతలం`. అనుష్క టైటిల్ రోల్ లో నటించిన `రుద్రమదేవి` హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కగా.. సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న `శాకుంతలం` మైథలాజికల్ టచ్ తో తెరకెక్కుతోంది. `రుద్రమదేవి`కి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు అందించగా.. `శాకుంతలం`కి ఇళయరాజా ఏకలవ్య శిష్యుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చుతున్నారు.
ఇదిలా ఉంటే.. `శాకుంతలం`లో సమంతకి జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మరో మలయాళ నటుడు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారట. ఆ నటుడు మరెవరో కాదు.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఇప్పటికే లాల్ తో గుణశేఖర్ సంప్రదింపులు జరిపారని.. పాత్ర నచ్చడంతో లాల్ కూడా అంగీకారం తెలిపారని కథనాలు వస్తున్నాయి. త్వరలోనే `శాకుంతలం`లో మోహన్ లాల్ ఎంట్రీపై క్లారిటీ రావచ్చు.
కాగా, మోహన్ లాల్ నటించిన ఎపిక్ హిస్టారికల్ వార్ డ్రామా `మరక్కార్: అరబిక్ కడలింటే సింహం` మే 13న పలు భాషల్లో పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.
![]() |
![]() |