![]() |
![]() |

మహాశివరాత్రికి విడుదలైన హిలేరియస్ ఎంటర్ టైనర్ `జాతిరత్నాలు`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` వంటి విజయవంతమైన చిత్రం తరువాత వచ్చిన `జాతిరత్నాలు`.. కథానాయకుడిగా నవీన్ స్థాయిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో.. పలు అగ్ర నిర్మాణ సంస్థలు నవీన్ తో సినిమాలు చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బేనర్ లో లేడీ సూపర్ స్టార్ అనుష్కతో కలిసి ఓ క్రేజీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేసేందుకు నవీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కథనాలు వస్తున్నాయి.
అంతేకాదు.. మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ కూడా నవీన్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. ఈ రెండు చిత్రాలతో పాటు మరో క్రేజీ ఆఫర్ కూడా నవీన్ చెంతకు చేరిందట. ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన `1 నేనొక్కడినే` కో- స్టార్ అయిన నవీన్ తో జీఎంబి ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ లో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారట. అడివి శేష్ హీరోగా మహేశ్ నిర్మిస్తున్న `మేజర్` పూర్తయ్యాకే.. నవీన్ సినిమా పట్టాలెక్కే అవకాశముందని టాక్. మొత్తమ్మీద.. నవీన్ పోలిశెట్టి వరుస క్రేజీ ఆఫర్లతో టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతున్నాడు.
![]() |
![]() |