![]() |
![]() |

2021 వేసవి తెలుగు సినీ అభిమానులకు ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్.. ఇలా నలుగురు సీనియర్ స్టార్స్ కూడా ఈ ఏడాది సమ్మర్ బరిలోకి దిగుతున్నారు. చిరు `ఆచార్య`, బాలయ్య `BB3` (వర్కింగ్ టైటిల్), నాగ్ `వైల్డ్ డాగ్`, వెంకీ `నారప్ప`.. ఈ నాలుగు సినిమాలు కూడా వారాల గ్యాప్ లో థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. వీటిలో `వైల్డ్ డాగ్` ఏప్రిల్ 2న రిలీజ్ కానుండగా.. మే 13న `ఆచార్య`, మే 14న `నారప్ప`, మే 28న `బీబీ3` రిలీజ్ కానున్నాయి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నాగ్ `వైల్డ్ డాగ్`, చిరు `ఆచార్య`ని ఒకే సంస్థ నిర్మిస్తోంది. ఆ నిర్మాణ సంస్థే.. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్. ఈ రెండు సినిమాలు కూడా సీరియస్ సబ్జెక్ట్స్ తోనే తెరకెక్కడం విశేషం. మరి.. బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో రాబోతున్న `వైల్డ్ డాగ్`, `ఆచార్య` చిత్రాలతో మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
`వైల్డ్ డాగ్`కి అహిషోర్ సల్మాన్ దర్శకత్వం వహించగా.. `ఆచార్య`ని కొరటాల శివ రూపొందిస్తున్నారు.
![]() |
![]() |