![]() |
![]() |

హిందీనాట ఘనవిజయం సాధించిన `అంధాధున్` చిత్రం .. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో రీమేక్ అవుతోంది. తెలుగు వెర్షన్ లో నితిన్, తమన్నా, నభా నటేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. `భ్రమమ్` పేరుతో రూపొందుతున్న మలయాళ వెర్షన్ లో పృథ్వీరాజ్, మమతా మోహన్ దాస్, రాశీఖన్నా ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.
ఇక `అంధగన్` పేరుతో తెరకెక్కుతున్న తమిళ వెర్షన్ లో ప్రశాంత్ కథానాయకుడిగా నటిస్తుండగా.. నెగటివ్ రోల్ లో నిన్నటి తరం అగ్ర కథానాయిక సిమ్రన్ దర్శనమివ్వనున్నారు. కాగా, కథానాయిక పాత్రలో `లీడర్` ఫేమ్ ప్రియా ఆనంద్ ఎంపికయ్యారని టాక్. `లీడర్` తరువాత తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నాయికగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియ. మరి.. `అంధాధున్` రీమేక్ తన కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
ప్రశాంత్ తండ్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి త్యాగరాజన్.. `అంధగన్`ని తనే స్వయంగా నిర్మిస్తూ మరీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ రీమేక్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |