![]() |
![]() |

పేరుకి కేరళకుట్టి అయినా.. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేశ్. మరీ ముఖ్యంగా.. తెలుగులో తను నటించిన `మహానటి`తో `జాతీయ ఉత్తమ నటి`గా పురస్కారాన్ని పొందింది.
ఇంత చేసి.. తెలుగులో కీర్తి నేరుగా నటించిన సినిమాల సంఖ్య పదిలోపే. `నేను శైలజ`, `నేను లోకల్`, `అజ్ఞాతవాసి`, `మహానటి`, `మన్మథుడు 2` (గెస్ట్ రోల్), `మిస్ ఇండియా`.. ఇలా ఇప్పటివరకు కేవలం ఆరు తెలుగు చిత్రాల్లోనే కీర్తి సందడి చేసింది. ఆమె నటించిన ఏడో తెలుగు సినిమా `రంగ్ దే` ఈ నెల 26న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తెలుగులో కీర్తి నటించిన మూడో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. గతంలో `నేను శైలజ`, `నేను లోకల్` ఇదే జానర్ లో రూపొంది విజయం సాధించాయి. ఆ రెండు సినిమాలకు బాణీలు అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నే.. `రంగ్ దే`కి కూడా స్వరకర్త. మరి.. డీఎస్పీ ఫ్యాక్టర్ మరోసారి కీర్తికి అచ్చొచ్చి.. తెలుగునాట హ్యాట్రిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ హిట్ క్రెడిట్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |