![]() |
![]() |
.jpg)
హీరో నితిన్ జూలై 26న తన ప్రేయసి షాలినిని వివాహమాడనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనల మేరకు రెండు కుటుంబాలవారు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరుగనున్నది. అందువల్ల తెలుగు చిత్రసీమలోని అతి కొద్దిమందిని మినహా మిగతావాళ్లనెవరినీ నితిన్ ఆహ్వానించలేదు. నితిన్ నుంచి పెళ్లి శుభలేఖ అందుకున్న ఆ అతికొద్ది మందిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఉన్నారు.
పవన్‌కు నితిన్ వీరాభిమాని కావడంతో ఆయనను తన సొంత మనిషిలా భావిస్తుంటాడు. అందుకే ఆయనకు ఇన్విటేషన్ అందించాడు. అలాగే తనకు 'అ.. ఆ..' అనే కెరీర్ బెస్ట్ ఫిలిమ్‌ను ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్‌కు కూడా శుభలేఖ ఇచ్చాడు నితిన్. సో.. స్నేహితులు కూడా అయిన పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కలిసే ఈ వివాహ వేడుకకు హాజరు కావచ్చని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ విలాసవంతమైన హోటల్లో ఈ వేడుక జరుగనున్నది.
![]() |
![]() |