![]() |
![]() |

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తల్లి దులరీ, ఆయన సోదరుడు రాజు ఖేర్ హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. రాజు ఖేర్ సతీమణి రీమా, కుమార్తె విృందా సైతం డిశ్చార్జ్ అయ్యారు. సుమారు వారం రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడటంతో అనుపమ్ ఖేర్ ఫ్యామిలీ అంతా ముంబైలోని కోకిలాబెన్ హాస్పటల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.
తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఇంటికొచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో అనుపమ్ ఖేర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కోకిలాబెన్ హాస్పటల్ వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. భౌతిక దూరం ప్రాముఖ్యతను సైతం వివరించారు.
కరోనా బారిన పడిన మరో బాలీవుడ్ ఫ్యామిలీ బచ్చన్ మెంబర్స్ ఇంకా హాస్పటల్‌లో ఉన్నారు. మొదట అమితాబ్, అభిషేక్ హాస్పటల్‌లో చేరగా... లేక్షణాలు లేకన్నా, కరోనా టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో కొన్ని రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఆరాధ్య తరవాత లక్షణాలు బయటపడటంతో హాస్పటల్‌కు వెళ్లారు. నానావతి హాస్పటల్‌లో బచ్చన్ ఫ్యామిలీ ట్రీట్మెంట్ తీసుకుంటోంది.
![]() |
![]() |