![]() |
![]() |
.jpg)
యాక్షన్ కింగ్‌గా పేరుపొందిన సీనియర్ యాక్టర్ అర్జున్ కుమార్తె, నటి ఐశ్వర్య కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆమె టెస్ట్‌లో కొవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఐశ్వర్య వెల్లడించారు. "ఇటీవల నాకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఒక వైద్య బృందం సలహాలు మేరకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గడచిన కొద్ది రోజులుగా నన్ను కాంటాక్ట్ అయిన వాళ్లెవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నా. అందరూ క్షేమంగా ఉండండి, దయచేసి మాస్క్ ధరించండి! మంచి ఆరోగ్యంతో త్వరలోనే నా విషయం అప్డేట్ చేస్తాను. గాడ్ బ్లెస్" అని ఆమె రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ చూసి స్పందించిన శ్రేయోభిలాషులు, అభిమానులు.. వేగంగా ఆమె కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఇప్పటివరకూ కొన్ని తమిళ, కన్నడ చిత్రాలలో నటించిన ఐశ్వర్య త్వరలో తన తండ్రి అర్జున్ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించడం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం కావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ తండ్రీకూతుళ్లు ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించారు. కానీ లాక్‌డౌన్ విధించినప్పట్నుంచీ షూటింగ్‌లు నిలిచిపోవడంతో వాళ్ల సినిమా ప్లానింగ్ కూడా వాయిదా పడింది.
![]() |
![]() |