![]() |
![]() |

రామ్ గోపాల్ వర్మను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఆర్జీవీ లక్ష్యంగా రోజుకొక సినిమా ప్రకటన వస్తోంది. దీనంతటకీ ‘పవర్ స్టార్’ అని వర్మ క్యాంప్ నుండి వస్తున్న సినిమా కారణమని చెప్పనవసరం లేదు అనుకుంట! ఆల్రెడీ ‘పరాన్నజీవి’ టైటిల్, ‘రెక్‌లెస్ జెనెటిక్ వైరస్’ క్యాప్షన్‌తో, అందులో ఆర్‌జివిని హైలైట్ చేస్తూ ‘బిగ్ బాస్’ ఫేమ్ నూతన్ నాయుడు ఒక సినిమా ప్రకటించారు. సోషల్ మీడియాలో మరో సినిమా పోస్టర్ కూడా చక్కర్లు కొడుతోంది.
‘పార్న్ జీవి’ అని వర్మపై సినిమా తీస్తున్నట్టు మరో ప్రకటన వచ్చింది. దీనికి సంజీవ్ రెడ్డి అనే అతను ఎవరో దర్శకుడు. ‘పెళ్ళాం వదిలేసిన ఒక దర్శకుడి కథ’ అని క్యాప్షన్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ, అతని భార్య వేరుపడిన సంగతి తెలిసిందే. అందుకు కారణాలు ఏంటనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు. దాన్ని బేస్ చేసుకుని సంజీవ్‌రెడ్డి సినిమా తీస్తున్నట్టు ఉన్నారు. పైగా, ‘ఒక ముసలి జీవి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా’ అని పోస్టర్ మీద పేర్కొన్నారు. ‘గురివింద గింజకి తన కింద ఉన్న నలుపు కనిపించదు’ అని వర్మపై సెటైర్ కూడా వేశారు.
ఇటువంటి వాటిని పట్టించుకునే రకం కాదు వర్మ. ఎవరెన్ని విమర్శలు చేసినా... తన పని తాను చేసుకుంటూ వెళతారు. అలాగే, ఇప్పుడు ‘పవర్ స్టార్’ సినిమాను మార్కెటింగ్ చేసి, క్యాష్ చేసుకొనే పనిలో పడ్డారు.
![]() |
![]() |